News5am, Breaking Telugu News (03-06-2025): బంగారం ధర భారీగా పెరిగింది. జూన్ 3వ తేదీ మంగళవారం నాడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,850గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90,610గా నమోదైంది. ఇక ఒక కేజీ వెండి ధర రూ. 1,11,010గా ఉంది. ప్రస్తుతం బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయి దగ్గరలో ట్రేడ్ అవుతున్నాయి. ఒక్కసారిగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు తీవ్రంగా ఉండడం వల్ల ఈ పెరుగుదల కనిపిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు మరింత దిగజారడం బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది. ఉక్రెయిన్, రష్యాపై డ్రోన్ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో రష్యాకు చెందిన ముఖ్యమైన మిలిటరీ స్థావరాలు ధ్వంసమయ్యాయి. దీంతోపాటు పలువురు సైనికులు మృతి చెందినట్లు అధికారికంగా సమాచారం అందింది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు అంతర్జాతీయంగా పెరిగినట్లు మన దేశంలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బంగారం ధర రూ. 99 వేల సమీపంలో ఉంది.
More Breaking News:
Breaking Telugu Gold News:
తులం బంగారం ఏకంగా రూ.5000 తగ్గింది..
More Telugu News: External Sources
జూన్ 3 మంగళవారం బంగారం ధరలు ఇవే… తులం బంగారం ధర ఎంతో తెలిస్తే షాక్ తినడం ఖాయం..