News5am,Breaking Telugu New (05-05-2025): బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరుగుదలతో వినియోగదారులకు షాకిచ్చాయి. నిన్న తులానికి రూ. 2700 పెరిగిన తరువాత, నేడు మరింతగా రూ. 500 పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర రూ. 9,900గా, 22 క్యారెట్ల ధర రూ. 9,075గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగి రూ. 90,750కు చేరగా, 24 క్యారెట్ల ధర రూ. 540 పెరిగి రూ. 99,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,900గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 99,150 వద్ద ఉంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 3100 పెరిగి రూ. 1,11,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 2100 పెరిగి రూ. 99,000 వద్ద ఉంది.
More Breaking Telugu News
మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు..
రేపటి నుంచి పద్మావతి పరిణయోత్సవాలు…
More Breaking Telugu New: External Sources
మళ్లీ పెరిగిన బంగారం ధర- మే 5న ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే? – GOLD RATE TODAY