News5am, Business News (14-05-2025): ప్రఖ్యాత టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ మళ్లీ పెద్దఎత్తున ఉద్యోగాలను తొలగించేందుకు సిద్ధమైంది. 2023లో దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించిన ఈ దిగ్గజం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన సిబ్బందిలో సుమారు 3 శాతం మందిని తీసిపెట్టనుందని సమాచారం. గత ఏడాది జూన్ నాటికి మైక్రోసాఫ్ట్‌లో 2.28 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. తాజా నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ విషయం పై సంస్థ ప్రతినిధి ఒకరు సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మార్కెట్లో పోటీలో ముందంజలో ఉండేందుకు అవసరమైన సంస్థాగత మార్పులు అనివార్యమని చెప్పారు. మేనేజ్‌మెంట్ స్థాయిలో ఉద్యోగులను తగ్గించడం, కార్యకలాపాలను సమర్ధవంతంగా పునఃవ్యవస్థీకరించడం లక్ష్యంగా ఉన్నదన్నారు. కాగా, ఈ సంవత్సరం జనవరిలో కొంతమందిని పనితీరు ఆధారంగా తొలగించిన సంగతి తెలిసిందే. కానీ తాజా ఉద్యోగాల కోత మాత్రం పనితీరు కారణంగా కాదని సంస్థ స్పష్టం చేసింది.
Business News:
వాణిజ్యంలో భారత స్టాక్ మార్కెట్
Latest Bullion Market News: తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..
News: External Sources
Microsoft: మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్