Gold and Silver Price: బంగారం ధరలు సరికొత్త రికార్డును సృష్టించాయి. జూన్ 19వ తేదీ గురువారం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,02,440గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,900గా ఉండగా, ఒక కేజీ వెండి ధర రూ. 1,11,480 పలుకుతోంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇది పసిడి ప్రియులకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. ప్రస్తుతం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటే ప్రజలు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 93,000 దాటి పోవడం వల్ల బంగారు ఆభరణాల ధరలు చుక్కలను తాకుతున్నాయి.
Gold and Silver Price
Gold and Silver Price విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణంగా ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ యుద్ధ ప్రభావంతో అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. బంగారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా వారు తమ సంపదను రక్షించుకుంటున్నారు. నిపుణుల అంచనాల ప్రకారం, యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగినంత కాలం బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఫిజికల్ బంగారం కొనుగోలు చేసే వారికి మాత్రం పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చరిత్రలోనే మొదటిసారిగా బంగారం ధర 1 లక్షా 3 వేల రూపాయలు దాటింది.
Internal Links:
ఈరోజు బంగారం ధర తెలిస్తే షాక్ తినడం ఖాయం…
External Links:
జూన్ 19వ తేదీ, గురువారం బంగారం ధరలు ఇవే…పసిడి ధర తులం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం…