Gold and Silver Prices Drop: బంగారం, వెండి ధరలు మరోసారి గణనీయంగా తగ్గాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,43,715కు పడిపోయింది. వెండి ధర కూడా కిలోకు రూ.2,25,000కి తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రూ.1,31,643, 23 క్యారెట్ల బంగారం రూ.1,43,140గా ఉంది. మార్చి 25తో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం రూ.2,490, 22 క్యారెట్ల బంగారం రూ.2,281 తగ్గాయి. వెండి ధర కూడా కిలోకు రూ.9,114 మేర పడిపోయింది.
అయితే హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మాత్రం స్వల్పంగా ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రూ.160 పెరిగి రూ.1,44,710కు, 22 క్యారెట్ల బంగారం రూ.150 పెరిగి రూ.1,32,650కు చేరింది. వెండి మాత్రం రూ.15,000 తగ్గి కిలోకు రూ.2,45,000గా ఉంది. IBJA ప్రకటించే రేట్లు దేశవ్యాప్తంగా వర్తిస్తాయి, కానీ సెలవు రోజుల్లో ధరలు ప్రకటించరు. అలాగే ఈ రేట్లలో GST, తయారీ ఛార్జీలు ఉండవు. మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ ఆధారంగా ధరలు మారుతూ ఉంటాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
External Links:
పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధర..