Gold and Silver Rates: అమెరికా తీసుకుంటున్న దూకుడు చర్యల ప్రభావంతో భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడులు పెరుగుతున్నాయని సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల గోల్డ్ రేట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే తులం ధర రూ.లక్ష దాటి పోయిన నేపథ్యంలో, ప్రపంచ రాజకీయాలు కూడా ఈ పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. శ్రావణమాసం సందర్భంగా షాపింగ్‌కు సిద్ధమవుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ధరల పెరుగుదలతో తర్జన భర్జనకు లోనవుతున్నారు. అందుకే, ముందుగా దేశవ్యాప్తంగా గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకొని తరువాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నేడు 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1000 పెరిగింది. చెన్నై, ముంబై, బెంగళూరు, కలకత్తా వంటి నగరాల్లో ఇది రూ.9380గా ఉండగా, ఢిల్లీ, జైపూర్, లక్నో, గురుగ్రాము వంటి చోట్ల రూ.9395గా ఉంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు రూ.1100 పెరిగి, చెన్నై, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో గ్రాముకు రూ.10,233గా, ఢిల్లీ, జైపూర్ వంటి చోట్ల రూ.10,248గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, తిరుపతి తదితర నగరాల్లో 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.93,800, 24 క్యారెట్ల తులానికి రూ.1,02,330గా ఉంది. వెండి ధర కేజీకి రూ.1,26,000గా నమోదైంది.
Internal Links:
External Links:
మధ్యతరగతి కొనలేని రేట్లకు గోల్డ్&సిల్వర్.. హైదరాబాదులో రేట్లు చూస్తే షాకే!