Today, Gold and Silver Rates: అమెరికా సెకండరీ సుంకాల గడువు దగ్గరపడటంతో పాటు, ఫెడ్ సెప్టెంబర్ సమావేశం ప్రభావం, అమెరికా ఆర్థిక పరిస్థితి అనిశ్చితి కారణంగా బులియన్ మార్కెట్ కుదురుతోంది. ఫలితంగా శనివారం రోజున బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. అదే సమయంలో రిటైల్ మార్కెట్‌లో వెండి ధర కిలోకు రూ.1,30,000 దాటటం ఆందోళన కలిగిస్తోంది. అందువల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు కొనుగోలు చేసే ముందు తమ ప్రాంతాల్లో తాజా ధరలను ఖచ్చితంగా చెక్ చేయాలి.
ఆగస్టు 23న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,090 పెరిగి, గ్రాముకు రూ.109 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,000 పెరిగి, గ్రాముకు రూ.100 పెరిగింది. ఏపీ, తెలంగాణ ప్రధాన నగరాల్లో ఈ పెరుగుదల కనిపించింది. మరోవైపు వెండి కూడా బలమైన పెరుగుదల కొనసాగిస్తూ, ఆగస్టు 23న కిలోకు రూ.2,000 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర కిలోకు రూ.1,30,000 చేరగా, గ్రాము ధర రూ.130గా ఉంది.
Internal Links:
తగ్గిన బంగారం.. పెరిగిన వెండి రేట్లు..
గురువారం పెరిగిన గోల్డ్-సిల్వర్..
External Links:
శనివారం పెరిగిన గోల్డ్.. లక్ష 30వేలు తాకిన కేజీ వెండి, షాకింగ్..