Gold and Silver Rates: పుత్తడి ధరల్లో నేడు స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. నిన్నటి వరకు ఎక్కువగా పెరిగిన ధరలు, ఈరోజు తక్కువగా పెరిగి కొంత ఊరటనిచ్చాయి. తులంపై రూ.10 పెరిగింది, కిలో వెండిపై రూ.100 తగ్గింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర రూ.10,261, 22 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర రూ.9,406గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.94,060, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,02,610 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.94,210, 24 క్యారెట్ల ధర రూ.1,02,760గా ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,29,900గా ఉండగా, ఢిల్లీలో కిలో వెండి రూ.1,19,900 వద్ద ట్రేడ్ అవుతోంది.
Internal Links:
External Links:
మళ్లీ బంగారం, వెండి ధరల్లో మార్పులు.. ఈరోజు ధరలు ఇవే