Gold and Silver Rates Fall

Gold and Silver Rates Fall: అమెరికా టారిఫ్స్ వార్ భయాలు మెల్లగా తగ్గిపోతుండటంతో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు సానుకూలంగా ముందుకు సాగుతున్నారు. దీని ప్రభావంతో బంగారం, వెండికి డిమాండ్ తగ్గింది. 2025 ఆగస్టు 12న 24 క్యారెట్ల బంగారం ధర, ఆగస్టు 11తో పోల్చితే 10 గ్రాములకు ₹880 (గ్రాముకు ₹88) తగ్గింది. 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ₹800 (గ్రాముకు ₹80) తగ్గింది. అలాగే వెండి కిలో రేటు ₹2,000 తగ్గి రెండు తెలుగు రాష్ట్రాల్లో ₹1,25,000కి చేరింది, గ్రాము వెండి ₹125 వద్ద కొనసాగుతోంది.

శ్రావణమాసం ప్రారంభం నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు రాఖీ పౌర్ణమి నుంచి తగ్గుముఖం పట్టాయి. ట్రంప్ భారతపై టారిఫ్స్ రెండోసారి పెంచటంతో ఇన్వెస్టర్లలో ఏర్పడిన ఆందోళనలు గోల్డ్, సిల్వర్ రేట్లు పెరగడానికి కారణమయ్యాయి. అయితే ఇప్పుడు ఇన్వెస్టర్లలో నమ్మకం పెరగడం, ఈక్విటీ మార్కెట్లు లాభాల్లోకి రావడం, బంగారంలో పెట్టుబడులు తగ్గడం వంటి కారణాలతో గోల్డ్ ధరలు తిరిగి పడిపోతున్నాయి.

Internal Links:

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల ఊగిసలాట

మధ్యతరగతి కొనలేని రేట్లకు గోల్డ్&సిల్వర్..

External Links:

తగ్గిన బంగారం వెండి రేట్లు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *