Gold and Silver Rates Increased: బంగారం ధరలు పసిడి అభిమానులను వణికిస్తున్నాయి. వరుస పెరుగుదలతో మరింత భారమవుతున్నాయి. ఒక్కరోజులోనే తులం బంగారం రూ.1640 పెరిగింది. వెండి కూడా బంగారం బాటలోనే పెరిగింది. హైదరాబాద్‌లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం (1 గ్రాము) రూ.10,495, 22 క్యారెట్ల బంగారం (1 గ్రాము) రూ.9,620గా ఉంది. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,500 పెరిగి రూ.96,200కి చేరింది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,640 పెరిగి రూ.1,04,950కి చేరింది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే ధరలు ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.96,350గా, 24 క్యారెట్ల బంగారం రూ.1,05,100గా ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.1,31,000గా ఉండగా, ఢిల్లీలో కిలో వెండి రూ.1,21,000కి చేరింది.
Internal Links:
మళ్లీ బంగారం, వెండి ధరల్లో మార్పులు..
External Links:
శనివారం పెరిగిన గోల్డ్- సిల్వర్.. ఏపీ, తెలంగాణ రేట్లివే..