మగువలకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో వరుసగా పెరిగిన బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. వరుసగా రెండోరోజు పసిడి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.160 తగ్గగా, ఈరోజు రూ.330 తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150, రూ.350 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (ఏప్రిల్ 15) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,200గా, 24 క్యారెట్ల ధర రూ.95,180గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరోవైపు వెండి ధర కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. వరుసగా రెండోరోజు ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై నిన్న రూ.100, ఈరోజు రూ.100 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ఈరోజు రూ.99,800గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోఐ ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి రూ.1,09,800గా ఉంది.