Gold Price: పసిడి ప్రియులను బంగారం ధర వణికిస్తోంది. బంగారం కొనుగోలు చేయాలంటేనే భయంతో వణికిపోయేలా చేస్తోంది. అంతర్జాతీయంగా నెలకున్న అనిశ్చిత పరిస్థితులు, యుద్ధ భయాలు కమ్ముకుంటున్న క్రమంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తులం బంగారం ధర లక్ష మార్క్ దాటింది. ఇప్పుడు బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. తుల బంగారం కొంటే లక్షకు పైగా ఖర్చు అవుతుంది. జూన్ 17వ తేదీకి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,01,660 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర ₹93,200గా ఉంది. వెండి ధర కూడా పెరిగి ₹1,09,900కి చేరింది. గత వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలు, అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధ పరిస్థితుల వల్ల స్టాక్ మార్కెట్లు కిందపడడం. అలాగే డాలర్ విలువ పడిపోవడం కూడా బంగారం ధర పెరగడానికి ఒక కారణం.
Gold Price కేవలం దేశీయంగానే కాదు, అంతర్జాతీయ మార్కెట్లో కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. అమెరికాలో 31.2 గ్రాముల (ఒక ఔన్స్) బంగారం ధర $3400 దాటిపోయింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, భవిష్యత్తులో కూడా బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీనికి మరో ముఖ్య కారణం, స్టాక్ మార్కెట్‌లో నష్టాల నేపథ్యంలో చాలా మంది ఇన్వెస్టర్లు తమ డబ్బును బంగారంలో పెట్టుబడి వేయడం. వారు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా చూస్తున్నారు.
బంగారం ధరలు పెరగడంతో బంగారు ఆభరణాల ధరలు కూడా పెరిగాయి. అందుకే ఇప్పుడు బంగారం కొనుగోలు చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తూకం, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, హాల్‌మార్క్ ఉన్న బంగారమే కొనుగోలు చేయాలి. అప్పుడు మాత్రమే మీరు పెట్టే డబ్బుకు నాణ్యమైన బంగారం వస్తుంది.
Internal Links:
బంగారం ధర ఎంతో తెలిస్తే షాక్..
External Links:
జూన్ 17వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఇవే. ఈరోజు బంగారం ధర తెలిస్తే షాక్ తినడం ఖాయం…