Gold Prices: బంగారం ధర తాజాగా సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు లక్ష రూపాయల మైలురాయిని దాటి దూసుకెళ్తున్నాయి. జూన్ 20వ తేదీ శుక్రవారం నాటి మార్కెట్ రేట్స్ ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,02,350గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 93,050గా ఉంది. వెండి ధర కూడా ఈ పెరుగుదల ధోరణిలో భాగంగా భారీగా పెరిగింది. ప్రస్తుతం ఒక కేజీ వెండి ధర రూ. 1,10,914 పలుకుతోంది. ఈ ధరలు చూస్తే బంగారం మార్కెట్ లో నెలకొన్న భారీ ఊపెంత వరకు వెళ్తుందో అంచనా వేయడం కష్టంగా మారింది.
ఈ పెరుగుదల బంగారు ఆభరణాల కొనుగోలు దారులకు నిజంగా ఊహించని శరాఘాతం అవుతుంది. ముఖ్యంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 93 వేల రూపాయలు దాటి పోవడంతో, సాధారణంగా కొనుగోలు చేసే గొలుసులు, చైన్‌లు, బ్రేస్‌లెట్‌లు మొదలైనవన్నీ అత్యధిక ధరలకు చేరుకుంటున్నాయి. ఉదాహరణకు, ప్రస్తుతం మార్కెట్‌లో 10 గ్రాముల బరువున్న ఒక 22 క్యారెట్ల బంగారు గొలుసును కొనాలంటే, కేవలం నికర బంగారం ధర మాత్రమే కాకుండా, తరుగు, మజూరి, ఇతర చార్జీలు కలిపిన తరువాత మొత్తం ఖర్చు రూ. 1,10,000 దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బంగారానికి వ్యామోహం ఉన్నవారు కొంత వెనకడుగు వేయాల్సి రావచ్చు. ధరల పెరుగుదల ఒక ఆర్ధిక షాక్‌గా కనిపిస్తోంది.
గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు Gold Prices గణనీయంగా పెరిగిన వాస్తవాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. 2024 జూన్ లో 22 క్యారెట్ల బంగారం ధరలు సుమారు రూ. 75,000 వరకు ఉండగా, ఏడాదిలోనే ధరలు దాదాపు రూ. 28,000 పెరిగాయి. అంటే ఒక్క తులాకు దాదాపు రూ. 3,500 నుంచి రూ. 4,000 వరకు చొప్పున పెరిగినట్టే. బంగారం ధరలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికన్ డాలర్ విలువ అంతర్జాతీయంగా పడిపోవడం వల్ల, పెట్టుబడిదారులు తాము పెట్టే డబ్బును బంగారంలో పెట్టాలని భావిస్తున్నారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో ఏర్పడిన అనిశ్చితి కూడా ఇన్వెస్టర్లను బంగారంపై ఆశ్రయపడేలా చేస్తోంది. బంగారం మరింత సురక్షిత పెట్టుబడి అని భావించే వీరి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అందువల్ల బంగారం ధరలు మున్ముందు కూడా పెరిగే అవకాశం ఉన్నది.
Internal Links:
External Links:
జూన్ 20వ తేదీ శుక్రవారం బంగారం ధరలు ఇవే… తులం బంగారం ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్