Gold Prices Drop: ఇటీవలి రోజులుగా వేగంగా పెరుగుతున్న బంగారం ధరలు గత రెండు రోజులుగా కొంత తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా మార్కెట్ లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, యుద్ధ భయాలు, ట్రంప్ ప్రకటించిన వాణిజ్య పన్నులు, ఇవన్నీ కలిసి బంగారం ధరలను గణనీయంగా పెంచాయి. అయితే శుక్రవారం నాడు ఒక్క తులం బంగారం ధర రూ.1360 తగ్గింది. తాజా పరిస్థితుల్లో, బంగారం ధరలు మరింత తగ్గి 10 గ్రాములకు రూ.550 తగ్గుముఖం పట్టాయి. ఇది బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఉపశమనాన్ని కలిగించింది. ఇదిలా ఉండగా, బంగారం పాటు వెండి ధరల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి.
నేటి బంగారం ధరల్ని పరిశీలిస్తే, 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.550 తగ్గి, ప్రస్తుతం తులానికి రూ.99,930కి ట్రేడ్ అవుతోంది. అలాగే, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.500 తగ్గి తులం ధర రూ.91,600గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.410 తగ్గి 10 గ్రాములకు రూ.74,950గా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే, హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధరలో భారీగా తగ్గుదల కనిపించింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,000 తగ్గి రూ.1,26,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే ప్రాంతాన్ని బట్టి బంగారం, వెండి ధరల్లో రోజువారీ మార్పులు జరిగే అవకాశముంది.
Internal Links:
External Links:
మరింత దిగువకు పసిడి.. నేటి ధరలు ఇలా..