బంగారం కొనుగోలు చేసే వారిని పసిడి రేట్లు షాక్ ఇస్తున్నాయి. క్రితం రోజు బంగారం ధర స్వల్పంగా తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులకు ఒక్కరోజు మురిపెమే అయింది. రోజు రోజుకి బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలతో పాటు దేశీయంగా పెరుగుతున్న డిమాండ్ బంగారం ధరలు పెంచుకుంటూ పోతాయి. ఎందుకంటే బంగారం అత్యంత విలువైన వస్తువుగా మారింది. ఏ శుభకార్యములకైనా బంగారం లేనిది పని జరగట్లేదు, అంతగా పుత్తడికి ప్రాధన్యత ఇస్తున్నారు. బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. మహిళల అందాన్ని రెట్టింపు చేసేది పుత్తడి ఒక్కటే.
ఇక దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై ఐదు వందల రూపాయల వరకూ పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. గత రెండు రోజుల్లో బంగారం ధర పది గ్రాముల పై వెయ్యి రూపాయలు పెరిగిందంటే శ్రావణ మాసం ప్రభావం అని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,100 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,200 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 91,900 రూపాయలుగా ఉంది.