Gold Prices Increased: గోల్డ్ లవర్స్‌కు మరోసారి షాక్ తగిలింది. పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. భారత్‌పై ట్రంప్ విధించిన 50 శాతం జరిమానా సుంకం బుధవారం నుంచి అమల్లోకి రానుండటంతో బంగారం రేట్లు పెరిగిపోయాయి. అయితే వెండి ధర మాత్రం ఉపశమనం కలిగించింది.
ఈరోజు 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.1,02,060కి చేరగా, 22 క్యారెట్ బంగారం ధర రూ.500 పెరిగి రూ.93,550కి చేరింది. 18 క్యారెట్ బంగారం ధర రూ.410 పెరిగి రూ.76,550 దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు వెండి ధర కిలోకు రూ.1000 తగ్గి రూ.1,20,000 వద్ద ఉంది. చెన్నైలో వెండి ధర రూ.1,30,000గా ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరులో మాత్రం కిలో వెండి రూ.1,20,000గా ఉంది.
Internal Links:
పెరిగిన గోల్డ్.. లక్ష 30వేలు తాకిన కేజీ వెండి, షాకింగ్..
External Links:
గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. పెరిగిన పసిడి ధరలు