Gold Cost

Gold Prices Rise Again: పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా బంగారం ధరలు మళ్లీ పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి. వరుసగా రెండో రోజు కూడా గోల్డ్ రేట్లు పెరిగాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు ఉండటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు తులం బంగారం ధర రూ.930 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,310 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.850 పెరిగి రూ.1,49,700 వద్ద ఉంది.

అదే సమయంలో 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.690 పెరిగి రూ.1,22,480 వద్ద కొనసాగుతోంది. అయితే వెండి ధర మాత్రం ఈరోజు మారలేదు. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద ఉంది. హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర రూ.3,00,000 కాగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో రూ.2,90,000 వద్ద అమ్ముడవుతోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

 గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్…

పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..

External Links:

గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *