Gold Rate Decreased: ఈవారం ప్రారంభంలో బంగారం ధరలు అమాంతం పెరిగినా, ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. అదే సమయంలో వెండి ధరలు ఊహించని స్థాయిలో పెరిగినప్పటికీ, నేడు స్వల్పంగా తగ్గాయి. దీంతో తెలుగు ప్రజలు బంగారం కొనుగోలు చేసే ముందు తమ ప్రాంతాల్లోని రేట్లను తప్పక గమనించాలి. నేడు 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.4,500 తగ్గింది. దీంతో చెన్నై, ముంబై, కలకత్తా, బెంగళూరు, కేరళ వంటి నగరాల్లో గ్రాముకు ధర రూ.9,100గా, దిల్లీ, లక్నో, జైపూర్ వంటి నగరాల్లో రూ.9,115గా ఉంది.
ఇక 24 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు రూ.4,900 తగ్గగా, చెన్నై, ముంబై, బెంగళూరు తదితర నగరాల్లో గ్రాముకు రూ.9,928గా ఉంది. దిల్లీ, జైపూర్, నోయిడా వంటి నగరాల్లో రూ.9,943గా ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.91,000గా, 24 క్యారెట్ల ధర రూ.99,280గా ఉంది. వెండి ధర కేజీకి రెండు రాష్ట్రాల్లో రూ.1,26,000గా కొనసాగుతోంది.
Internal Links:
మంగళవారం తగ్గిన గోల్డ్ రేట్లు..
External Links:
పతనమైన బంగారం, వెండి రేట్లు.. బుధవారం హైదరాబాద్ రేట్లివే..