Gold Rate Decreased Iran-Israel War: బంగారం ధర భారీగా తగ్గింది. నిన్నటితో పోల్చితే ఏకంగా రెండు వేల రూపాయలు తగ్గింది. జూన్ 21వ తేదీ శనివారం నాటి ధరలు ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,00,470 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,090గా ఉంది. ఒక్క కేజీ వెండి ధర రూ. 1,19,000 పలికింది. బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్నా, ప్రస్తుతం ఇప్పటికీ రూ. 1 లక్ష పైనే ఉన్నాయి. అయితే గత వారం రోజుల గమనిక ప్రకారం, బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగినట్లు కనిపిస్తోంది.
పసిడి ధరలు పెరగడానికి ముఖ్య కారణం అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులే. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, ముఖ్యంగా అమెరికా మరియు ఆసియా మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ నిధులను సురక్షితంగా ఉంచుకునేందుకు బంగారంలో భారీగా పెట్టుబడి పెడుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల బంగారం డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో ధరలు కూడా వేగంగా పెరిగి, బంగారం కొనుగోలు చేసే వారికి అధిక ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
Internal Links:
రోజు రోజుకి పెరుగుతున్న పసిడి ధరలు..