Gold Rate Today: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితుల మార్పుల కారణంగా బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల తులం బంగారం ధర లక్షకు పైగా చేరి స్థిరంగా స్వల్ప పెరుగుదలతో కొనసాగుతోంది. రాఖీ పండుగను ముందుగా భావించిన తెలుగు రాష్ట్రాల ప్రజలు బంగారం కొనుగోలు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు రూ.50 పెరిగింది. దేశంలోని ప్రముఖ నగరాలైన చెన్నై, ముంబై, కలకత్తా, బెంగళూరు, కేరళలో రూ.9,295గా ఉండగా, ఢిల్లీ, జైపూర్, అయోధ్య వంటి నగరాల్లో రూ.9,310కి చేరాయి.
అలానే 24 క్యారెట్ల బంగారం ధర కూడా 100 గ్రాములకు రూ.50 పెరిగింది. దీంతో గ్రాముకు ధర రూ.10,140గా ఉండగా, ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నోయిడాల్లో రూ.10,155కి చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడలో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.92,950గా ఉండగా, 24 క్యారెట్ల ధర తులానికి రూ.1,14,000గా ఉంది. వెండి ధర కూడా కేజీకి రూ.1,23,000గా ఉంది.
Internal Links:
వరుసగా రెండో రోజు తగ్గిన గోల్డ్, సిల్వర్ ధరలు..
External Links:
స్థిరంగా గోల్డ్ రేట్లు.. హైదరాబాదులో ఇవాళ తులం ఎంతంటే..?