Gold Rates Started Picking Up Heavily: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై ఒత్తిడిని పెంచే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగించడంతో పాటు, రష్యాతో రాజకీయ ఉద్రిక్తతలు యుద్ధ స్థాయికి చేరుతున్న నేపథ్యంలో, గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత నెలకొంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం కొనుగోళ్లపై దృష్టి పెట్టడం ద్వారా గోల్డ్ రేట్లు ఊహించని రీతిలో పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పెరుగుదల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు పెరిగిన ధరలతో ఆందోళన చెందుతున్నారు. 22 క్యారెట్ల బంగారం ధర నిన్నతో పోలిస్తే 100 గ్రాములకు రూ.14,000 పెరిగింది. దేశవ్యాప్తంగా చెన్నై, ముంబై, బెంగళూరు, పూణే, కలకత్తా, లక్నో, జైపూర్ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ ధర గ్రాముకు సగటున రూ.9,290 నుంచి రూ.9,305 మధ్య కొనసాగుతోంది.
అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.15,300 పెరిగింది. చెన్నై, ముంబై, బెంగళూరు, కలకత్తా, పూణే వంటి నగరాల్లో ఇది గ్రాముకు సగటున రూ.10,135గా ఉండగా, ఢిల్లీ, జైపూర్, లక్నో, నోయిడా వంటి నగరాల్లో రూ.10,150 వద్ద నమోదైంది. ఇదే నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.92,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.1,13,050కి విక్రయాలు జరుగుతున్నాయి. అలాగే వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1,28,000 వద్ద కొనసాగుతోంది.
Internal Links:
వరుసగా రెండో రోజు తగ్గిన గోల్డ్, సిల్వర్ ధరలు..
External Links:
భయంకరంగా పెరిగిన గోల్డ్.. శనివారం హైదరాబాద్ రేట్ చూస్తే షాకే..