ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న ఉదయం 6 గంటలకు నమోదైన ధరలతో పోలిస్తే సెప్టెంబర్ 14న దేశీయంగా తులం బంగారంపై 1300 వరకు పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా ధరను పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,260 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,460గా ఉంది.
గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న వెండి ధరలు నిన్న మరోమారు పెరిగాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో నిన్న కిలో వెండిపై రూ. 2 వేలు పెరిగి రూ. 89 వేలకు చేరింది. గత నాలుగు రోజుల్లో కిలో వెండిపై ఏకంగా రూ. 5,200 పెరగడం గమనార్హం. హైదరాబాద్‌లో ఈ ధర రూ. 95 వేలుగా నమోదైంది.