16 జూలై 2024: ఆషాఢమాసంలో కూడా బంగారం ధరలు తగ్గడం లేదు. రెండు రోజులు స్వల్పంగా తగ్గితే అంతకు మించి ఒకేరోజులో ధరలు పెరుగుతున్నాయి. ఈ రోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.350 పెరిగి రూ.67850 కాగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.380 పెరిగి రూ.74020 వద్ద ఉంది. బంగారం ధరలు పెరిగినప్పటికీ కూడా వెండి ధరలు తగ్గాయి. కిలో వెండి ధర మునుపటికంటే రూ.200 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.95500. వెండి ధరలు వరుసగా తగ్గడం ఇది రెండో రోజు కావడం గమనార్హం.