మంగళవారం దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి (22 క్యారెట్లు) రూ. 10 పెరిగింది, రూ. 64,710కి చేరింది. సోమవారం ధర రూ. 64,700. మరియు 100 గ్రాముల (22 క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 64,710కి చేరింది. ప్రస్తుతం 1 గ్రాము బంగారం ధర రూ. 6,471గా కొనసాగుతున్నాయి.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 10 పెరిగి రూ. 70,590కి చేరింది.
మంగళవారం కూడా దేశంలోని కీలక ప్రాంతాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 64,860 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,740 ఉంది. హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 64,710గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 70,590గా నమోదైంది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 87,400 పలుకుతోంది.