Gold value Increased Today: పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం, వెండి ధరలు వరుసగా రెండు రోజులు తగ్గడంతో కొనుగోలుదారులు ఆనందించారు. ధరలు ఇంకా తగ్గుతాయని భావించిన వేళ బుధవారం ఒక్కసారిగా భారీ షాక్ తగిలింది. తులం బంగారం ధర రూ.6,600 పెరగగా, కిలో వెండి ధర రూ.40,000 పెరిగింది. దీంతో సామాన్యులు మళ్లీ ఆందోళనకు గురయ్యారు.
ధరల పెరుగుదలతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,60,530కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,47,150 వద్ద, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,20,400 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర కూడా భారీగా పెరిగి, కిలో వెండి రూ.3,20,000 వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో ఇదే ధర కొనసాగుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
External Links:
మగువలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు