బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6%కి తగ్గించడంతో ధరలు భారీగా తగ్గాయి. వాస్తవానికి బంగారం ఒక్కోసారి ధరలు తగ్గితే మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అయితే బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలతో పుత్తడి, వెండి ధర భారీగా పెరుగుతోంది అని విశ్లేషకులు తెలుపుతున్నారు. బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. మహిళల అందాన్ని రెట్టింపు చేసేది పుత్తడి ఒక్కటే. రానున్నది శ్రావణమాసం కావడంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముంది. పెళ్లిళ్లకు , శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయడంతో ధరలు విపరితంగా పెరుగుతున్నాయి. ఏ శుభకార్యములకైనా బంగారం లేనిది పని జరగట్లేదు, అంతగా పుత్తడికి ప్రాధన్యత ఇస్తున్నారు.
నేడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 64,010గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.69,830గా నమోదైంది. రానున్న శ్రావణమాసంలో ధరలు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు తెలుపుతున్నారు.