Good News for Gold Lovers: వారం ప్రారంభం నుంచి పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు భారీగా తగ్గాయి. ముఖ్యంగా 22 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు రూ.12,500 తగ్గి, చెన్నై, ముంబై, కలకత్తా, బెంగళూరు, కేరళ, పూణే వంటి నగరాల్లో రూ.9,255గా ఉంది. ఢిల్లీ, లక్నో, జైపూర్, అయోధ్య, నోయిడా, గురుగ్రామ్ లాంటి నగరాల్లో మాత్రం ఇది రూ.9,270కు చేరింది. ఈ ధరల తగ్గుదలతో చాలామంది కొనుగోళ్లు ప్రారంభించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇదే సమయంలో వెండి ధరలు గత ఆరు నెలల్లో భారీగా పెరగడంతో వినియోగదారులకు షాక్ తగిలింది.
24 క్యారెట్ల బంగారం కూడా నేడు 100 గ్రాములకు రూ.13,600 తగ్గి, చెన్నై, ముంబై, బెంగళూరు, కలకత్తా, కేరళ, మైసూరు, మంగళూరు వంటి నగరాల్లో రూ.10,097గా ఉంది. ఢిల్లీ, లక్నో, జైపూర్, గురుగ్రామ్, నోయిడాలో ఇది రూ.10,112గా కొనసాగుతోంది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడ వంటి నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.92,550గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.1,00,970గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర కేజీకి రూ.1,28,000గా ఉంది.
Internal Links:
తులం రూ.లక్ష కిందకి తగ్గనంటున్న గోల్డ్..
External Links:
గురువారం కుప్పకూలిన గోల్డ్ రేటు.. హైదరాబాదీస్ ఇక లేట్ చేయెుద్దు..