Good News For Gold Lovers: పసిడి ప్రేమికులకు శుభవార్త. బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. నేటి ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.450 తగ్గగా, వెండి కిలో ధర ఏకంగా రూ.2000 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర ప్రస్తుతం రూ.9,170గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.10,003గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.91,700కి చేరింది. అదే విధంగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.450 తగ్గి రూ.1,00,030గా ఉంది. 24 క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధర రూ.4,500 తగ్గి రూ.10,00,300 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడ, విశాఖపట్నం సహా ఇతర నగరాల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.91,850గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.1,00,180కి చేరింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి కిలో ధర ప్రస్తుతం రూ.1,25,000గా ఉంది. ఢిల్లీలో అయితే అదే కిలో వెండి రూ.1,15,000 వద్ద ట్రేడ్ అవుతోంది. మొత్తం మీద బంగారం, వెండి ధరల్లో ఈ తగ్గుదల వినియోగదారులకు ఒక ఊరటగా మారింది.
Internal Links:
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
External Links:
యాహూ.. కనకం కమింగ్ డౌన్.. వేలల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు