Hyderabad Gold Price Today: బంగారం ధరలు గోల్డ్ ప్రియులకు భారీ షాక్ ఇస్తున్నాయి. గత వారం రోజులుగా పసిడి ధరలు రోజు రోజుకూ పెరుగుతుండగా, ఈరోజు కూడా భారీగా పెరిగాయి. బుధవారం (జులై 23) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.950 పెరిగి రూ.93,800గా, 24 క్యారెట్ల బంగారం రూ.1,040 పెరిగి రూ.1,02,330గా నమోదైంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలలో కూడా ఇదే ధరలు కొనసాగుతుండగా, ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.93,950, 24 క్యారెట్ల పసిడి రూ.1,02,480గా ఉంది. మరో 2-3 రోజుల్లో ఆషాడం ముగిసి శ్రావణ మాసం ప్రారంభమవుతుండటంతో పెళ్లిళ్లు, పండుగల సీజన్‌లో ప్రజలు బంగారం కొనుగోలుకు సన్నద్ధమవుతుండగా, ధరలు ఊహించని స్థాయిలో పెరగడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
ఇక వెండి ధరలు కూడా అదే బాటలో పరిగెత్తుతున్నాయి. నిన్న కిలో వెండి ధర రూ.2,000 పెరగగా, ఈరోజు రూ.1,000 పెరిగి బులియన్ మార్కెట్‌లో రూ.1,19,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర కిలోకు రూ.1,29,000గా ఉండగా, ముంబై, ఢిల్లీ, బెంగళూరులో రూ.1,19,000గా కొనసాగుతోంది. ఇవి ఈరోజు ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరలు కాగా, ప్రాంతాలవారీగా స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి.
Internal Links:
తులం రూ.లక్ష కిందకి తగ్గనంటున్న గోల్డ్..
బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు..
External Links:
గోల్డ్ ప్రియులకు భారీ షాక్.. నేడు తులం బంగారం రేటు ఎంతో తెలుసా?