దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు లాభాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మన సూచీలు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ మరియు ఎఫ్ఎంసీజీ సూచీలు లాభపడ్డాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే మన రూపాయి ప్రస్తుత మారకం విలువ రూ. 85.19. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 187 పాయింట్లు పెరిగి 79,595 వద్ద ముగిసింది. నిఫ్టీ 41 పాయింట్లు పెరిగి 24,167 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: ఐటీసీ (2.58), హిందుస్థాన్ యూనిలీవర్ (2.06), మహీంద్రా అండ్ మహీంద్రా (1.89), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.78), కోటక్ బ్యాంక్ (1.11).
టాప్ లూజర్స్: ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.88), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.30), ఇన్ఫోసిస్ (1.93), భారతి ఎయిర్ టెల్ (1.68), బజాజ్ ఫిన్ సర్వ్ (1.25).