Infosys Share Buyback: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ రూ.18,000 కోట్ల విలువైన షేర్లను మార్కెట్ నుంచి తిరిగి కొనుగోలు (బైబ్యాక్) చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం పెయిడప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 2.41 శాతం అంటే 10 కోట్ల షేర్లను ఒక్కొక్కదానికి రూ.1,800 చెల్లించి కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. గురువారం సమావేశమైన బోర్డు సభ్యులు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఇన్ఫోసిస్ చరిత్రలో ఇది అతి పెద్ద బైబ్యాక్‌గా నిలవనుండగా, గత మూడేళ్లలో ఇలాంటి నిర్ణయం ఇదే మొదటిసారి. కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టయినప్పటి నుంచి ఇది ఐదోసారి బైబ్యాక్ అవుతుంది.
బీఎ్‌సఈలో గురువారం ఇన్ఫోసిస్ షేరు ధర 1.51 శాతం తగ్గి రూ.1,509.5 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే తిరిగి కొనుగోలు ధర 19 శాతం ఎక్కువగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. జూన్ త్రైమాసికం ముగిసే సరికి సంస్థ 88.4 కోట్ల డాలర్ల (సుమారు రూ.7,805 కోట్లు) ఫ్రీ క్యాష్‌ఫ్లోను నమోదు చేసింది. ఈ బైబ్యాక్ ప్రతిపాదనకు తుది ఆమోదం వాటాదారుల నుంచే రావాల్సి ఉంది.
Internal Links:
మస్క్‌ను వెనక్కి నెట్టిన ల్యారీ ఎల్లిసన్..
నిమిషాల్లో డబ్బు డబుల్ చేసిన ఐపీవో..
External Links:
ఇన్ఫీ రూ 18000 కోట్ల బైబ్యాక్