ITR Filing Deadline Extension: ఆదాయపు పన్ను రిటర్నుల గడువు సెప్టెంబర్ 15, 2025తో ముగుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈసారి ఇ-ఫైలింగ్ పోర్టల్ సమస్యలు, ఐటీఆర్ ఫారాల ఆలస్య జారీ కారణంగా మరోసారి గడువు పొడగించాలని ట్యాక్స్ పేయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు కోరినా, కేంద్రం మాత్రం ఇక గడువు పొడగించే ఆలోచన లేదని తేల్చేసింది. ఇప్పటికే జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు 45 రోజుల అదనపు సమయం ఇచ్చినట్లు గుర్తు చేసింది. సెప్టెంబర్ 7న జారీ చేసిన ప్రకటనలో, అకౌంట్ ఆడిట్ అవసరం లేని ట్యాక్స్ పేయర్లకు సెప్టెంబర్ 15 గడువు తుదిగడువేనని స్పష్టం చేసింది.
ఇక గడువు మిస్ అయితే పెనాల్టీలు తప్పవని కూడా హెచ్చరించింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సమయానికి రిటర్నులు ఫైల్ చేయడం ప్రతి ట్యాక్స్ పేయర్ బాధ్యత అని కేంద్రం తెలిపింది. సమయానికి ఫైల్ చేస్తే పెనాల్టీలు తప్పించుకోవడమే కాకుండా రీఫండ్ త్వరగా పొందే అవకాశం ఉంటుందని, రుణాలు, వీసాలు, ఇతర ఆర్థిక అవసరాల కోసం రికార్డులు ఉపయోగపడతాయని సూచించింది.
Internal Links:
ఇన్ఫీ రూ 18000 కోట్ల బైబ్యాక్..
External Links:
మరోసారి ఐటీఆర్ గడువు పెంపు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. ఏం చెప్పిందంటే?