News5am, Latest Breaking News9 (26-05-2025): బంగారం ధరలు భారీగా తగ్గాయి. పసిడి ధరలు తగ్గడానికి ప్రధానంగా అనేక కారణాలు దోహదం అవుతున్నాయి. మే 26వ తేదీ సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98070 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89890 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 110800 పలికింది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా ఇన్వెస్టర్లు బంగారం పై పెట్టిన పెట్టుబడులను ప్రాఫిట్ బుకింగ్ రూపంలో లాభాలను వెనక్కు తీసుకోవడమే అసలు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ తగ్గింది అని చెప్పవచ్చు. దీనికి తోడు స్టాక్ మార్కెట్లలో సానుకూల ఓపెనింగ్ సూచిస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గడానికి సిద్ధమవుతున్నాయి.
ఫలితంగా ఆల్ టైం రికార్డు కన్నా కూడా బంగారం ధర ప్రస్తుతం 2000 రూపాయలు తక్కువగా ట్రేడ్ అవుతోంది. రెండు రోజుల క్రితం బంగారం ధరలు నిజానికి ఒక లక్ష రూపాయల సమీపానికి చేరుకున్నాయి. కానీ అనూహ్యంగా బంగారం ధరలు మళ్ళీ తగ్గడం ప్రారంభించాయి. బంగారం ధరలు సాధారణంగా తగ్గడానికి ప్రధాన కారణం స్టాక్ మార్కెట్లో లాభాలు నమోదైనట్లయితే బంగారం ధరలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తుంటారు. ఎందుకంటే ఇన్వెస్టర్లు తమ డబ్బులను బంగారం నుంచి స్టాక్ మార్కెట్ వైపు తరలించేందుకు ప్రయత్నిస్తారు అప్పుడు బంగారానికి డిమాండ్ తగ్గి బంగారం ధర తగ్గుతుంది. దీనికి తోడు డాలర్ విలువ పెరిగినప్పుడు కూడా బంగారం ధర తగ్గుతుంది.
More Latest Breaking News:
Latest Breaking News9:
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ రేటు ఎంత తగ్గిందంటే..?
More Latest Breaking News: External Sources
ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..