News5am, Latest Gold rate News (20-05-2025): ఇటీవల దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గడం వల్ల పెళ్లిళ్ల కోసం షాపింగ్ చేస్తున్న సామాన్య ప్రజలకు ఇది శుభవార్తగా మారింది. అంతర్జాతీయ పరిస్థితులు స్థిరంగా ఉన్నా, గోల్డ్ రేట్లు అనూహ్యంగా మారుతుండటం గమనార్హం. నేడు 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే 100 గ్రాములకు రూ.4,500 తగ్గగా, చెన్నై, ముంబై, బెంగళూరు, కలకత్తా, కేరళ వంటి ప్రధాన నగరాల్లో ధర రూ.8,710గా ఉంది. దిల్లీ, జైపూర్, లక్నో, గురుగ్రామ్, నోయిడాల్లో ఇది రూ.8,725గా ఉంది.
అదే విధంగా, 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే 100 గ్రాములకు రూ.4,900 తగ్గింది. చెన్నై, ముంబై, బెంగళూరు తదితర నగరాల్లో ఇది గ్రాముకు రూ.9,502గా ఉండగా, దిల్లీ, జైపూర్, లక్నో వంటి నగరాల్లో రూ.9,517గా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్, విజయవాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల ధర రూ.8,710, 24 క్యారెట్ల ధర రూ.9,502గా ఉంది. ఇక వెండి ధర రెండు రాష్ట్రాల్లో కేజీకి రూ.1,08,000గా కొనసాగుతోంది.
More Gold rates:
Latest Gold rate News:
తారక్ బర్త్ డే సందర్భంగా, మోత మోగిపోతున్న సోషల్ మీడియా..
హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర..