Aug-28 Gold Rates

News 5am, Latest Gold Rates (13-05-2025): చైనా దిగుమతులపై అమెరికా 90 రోజుల టారిఫ్ విరామం ప్రకటించడంతో బంగారానికి డిమాండ్ తగ్గింది. దాంతో దేశ రాజధానిలో సోమవారం బంగారం ధర రూ. 3,400 తగ్గి రూ. 96,550కి పడిపోయింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ. 3,400 తగ్గి రూ. 96,100కి చేరింది. గత సంవత్సరం జులై 23న బంగారం ధర రూ. 3,350 పడిపోయింది. ఆ తర్వాతి 10 నెలల్లో ఇదే అత్యంత పెద్ద పతనం. 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర శనివారం 10 గ్రాములకు రూ. 99,950గా ఉండగా, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర రూ. 99,500 వద్ద నిలిచింది. మెహతా ఈక్విటీస్ లిమిటెడ్‌ కమోడిటీస్ అనలిస్ట్ రాహుల్ కలాంత్రి వ్యాఖ్యానిస్తూ, “అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి కనిపిస్తోంది. అలాగే భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంవల్ల బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి” అన్నారు.

వెండి ధర కూడా కొంత మేర తగ్గింది. శనివారం కిలో వెండి ధర రూ. 99,900గా ఉండగా, సోమవారం రూ. 200 తగ్గి రూ. 99,700కి పడిపోయింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధర రూ. 3,932 తగ్గి రూ. 92,586 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా, స్పాట్ బంగారం ధర 3 శాతం తగ్గి ఔన్సుకు (28.3 గ్రాములు) 3,218.70 డాలర్లకు చేరింది. అలాగే స్పాట్ వెండి ధర 1.19 శాతం తగ్గి ఔన్సుకు 32.33 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Latest Gold Rates: External Sources

Todays Gold Rate:పసిడి ప్రియులకు ఊరట..!!

Other Latest News:

జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..

మే 17 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *