News5am, Latest Telugu News (27-05-2025): పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి, గతంలో ఎన్నడూ లేని విధంగా గత నెల లక్ష మార్కు దాటాయి. ఆ తర్వాత కొంత మేర తగ్గుతూ వచ్చినప్పటికీ, మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల 95వేల వరకు దిగొచ్చిన పసిడి ధరలు మళ్లీ నాలుగైదు రోజుల్లోనే 98వేల మార్క్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర పెరిగింది. మే 27 2025 మంగళవారం ఉదయం వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర 97,630 ఉండగా, 22 క్యారెట్ల ధర 89,490 లుగా ఉంది. పది గ్రాముల బంగారంపై రూ.10 మేర ధర పెరిగింది. వెండి కిలో ధర రూ.100 పెరిగి, రూ.1,00,100 లుగా ఉంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,630గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.89,490లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.1,11,100లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,630గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 89,490లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,11,100 లుగా ఉంది.
More Latest Gold News:
Latest Telugu News:
ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
More Latest Telugu News: External Sources
అలర్ట్.. తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..