Latest Telugu News

News5am, Latest Telugu News (11-06-2025): గత కొన్ని రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. పెట్టుబడిదారులు తమ డబ్బును ఎక్కడ పెట్టాలన్న దానిపై బ్రోకరేజ్ సంస్థల సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నారు. కొందరు తమ స్వంత వ్యూహాలతో పెట్టుబడులను ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు సూచించిన షేర్లపై ఓ నజర్ వేద్దాం.

జేఎం ఫైనాన్షియల్స్ సంస్థ ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ షేర్లపై బై రేటింగ్ ఇచ్చింది. విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని, పవర్ మార్కెట్‌కు 18 శాతం వృద్ధి అవకాశముందని పేర్కొంది. షేర్ టార్గెట్‌ను రూ.231గా పేర్కొంది. ఇక మోతీలాల్ ఓస్వాల్ సంస్థ టైమ్ టెక్నోప్లాస్ట్ షేర్లపై బులిష్‌గా ఉంది. ఈ షేరు 33% పెరిగి రూ.578కి చేరే అవకాశం ఉందని తెలిపింది. రుణ విముక్తి కోసం చేస్తున్న కృషి, ఖర్చుల తగ్గింపు, లాభాలపై దృష్టి పెట్టడం వంటివి కంపెనీ ఎదుగుదలకు సహకరిస్తాయని తెలిపింది.

వెల్‌స్పన్ కంపెనీ షేర్లపై విదేశీ బ్రోకరేజ్ జెఫరీస్ ఆశాభావంగా ఉంది. ఈ టెక్స్‌టైల్ దిగ్గజం అమెరికా, యూరోప్, యూకేకు ఎగుమతులు చేస్తోంది. రాబోయే కాలంలో షేరు ధర రూ.185 వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతోంది. అయితే అమెరికా టారిఫ్‌లు, పత్తి ధరలు సమస్యగా మారవచ్చని హెచ్చరించింది. మరోవైపు, దలాల్ అండ్ బ్రోచ సంస్థ ఈ2ఈ నెట్వర్క్స్ షేర్లు రూ.3750 వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే మోతీలాల్ ఓస్వాల్ సంస్థ గో ఫ్యాషన్ ఇండియా షేర్లపై కొనుగోలు రేటింగ్ ఇస్తూ, ప్రస్తుతం ఉన్న ధర కంటే 30 శాతం పెరిగి రూ.1127కి చేరవచ్చని అంచనా వేసింది. కంపెనీ ప్రస్తుతం 180 నగరాల్లో వ్యాపారాన్ని విస్తరించడమే ఇందుకు కారణమని తెలిపింది.

More Latest Telugu News:

Latest Telugu News:

256 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..

ఈ వారం స్టాక్ మార్కెట్ డైరెక్షన్‌‌‌‌..

More Latest Telugu News: External Sources

బ్రోకరేజీలు మెచ్చిన టాప్-5 స్టాక్స్.. 38% వరకు లాభాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *