News5am, Latest Telugu News ( 30/04/2025) : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలున్నా, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే సూచీలు ఊగిసలాటకు లోనయ్యాయి.
ముగింపు సమయానికి సెన్సెక్స్ 46 పాయింట్లు నష్టపోయి 79,879 వద్ద, నిఫ్టీ 1 పాయింట్ నష్టంతో 24,334 వద్ద నిలిచింది. రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 47 పైసలు పెరిగి రూ.84.49కి చేరింది. మారుతి, భారతి ఎయిర్‌టెల్ లాంటి కంపెనీలు లాభాల్లో ఉన్నప్పటికీ, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ వంటి షేర్లలో భారీ నష్టాలు నమోదయ్యాయి.