Mar-9 Gold Rates: పశ్చిమాసియా యుద్ధం కారణంగా చాలా వస్తువుల ధరలు పెరుగుతున్నప్పటికీ బంగారం, వెండి ధరలు మాత్రం తగ్గుతున్నాయి. ఇప్పటికే వంట గ్యాస్ ధరలు పెరిగాయి, స్టాక్ మార్కెట్ కూడా పడిపోతోంది. కానీ బులియన్ మార్కెట్‌లో గత వారం నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు కూడా తులం బంగారం ధర రూ.1,960 తగ్గగా, వెండి ధర కిలోకు రూ.5,000 తగ్గింది.
దీంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,680గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,48,000 వద్ద, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,21,260 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండి ధర కిలోకు రూ.5,000 తగ్గి ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో రూ.2,80,000గా ఉంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద కొనసాగుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
External Links:
మగువలకు బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు