దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు అంతర్జాతీయ తిరోగమనంతో చివరి వరకు అదే ట్రెండ్‌ను అనుసరించాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 203 పాయింట్లు నష్టపోయి 75,935 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 22,913 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 86.65గా ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.32%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.01%), అదానీ పోర్ట్స్ (2.85%), టాటా స్టీల్ (1.58%), టాటా మోటార్స్ (1.33%).
టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.35%), మారుతి (-1.81%), టెక్ మహీంద్రా (-1.69%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.33%), ఐటీసీ (-1.06%).