రూపే క్రెడిట్ కార్డు వినియోగదారులకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) బ్యాంకులకు ఆదేశాలను జారీ చేసింది. రూపే క్రెడిట్ కార్డులకు సైతం సాధారణ క్రెడిట్ కార్డులతో సమానంగా రివార్డు పాయింట్లు ఇవ్వాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ బ్యాంకులను ఆదేశించింది. ప్రస్తుతం దేశంలో ఎటు చుసిన డిజిటల్ పేమెంట్ భారీగా పెరిగాయి. ఈ క్రమంలో క్రెడిట్ కార్డుల ద్వారా UPI పేమెంట్స్ చేసేందుకు బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డులకు అవకాశం కల్పించింది. ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డులకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర కార్డు లావాదేవీలపై అందించే రివార్డు పాయింట్లు, ఇతర బెనిఫిట్స్ రూపే క్రెడిట్ కార్డులకు అందించాలని స్పష్టం చేసింది.
సెప్టెంబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలు చేయాలని ఎన్‌పీసీఐ ఆదేశించింది. దీని ద్వారా రూపే కార్డుల వినియోగం పెరుగుతుందని, వాటి ద్వారా సాధారణ, యూపీఐ లావాదేవీలు చేసే వారికి మరిన్ని రివార్డు పాయింట్లు అందుకునే అవకాశం కలుగుతుందని పేర్కొంది. క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లు ఇవ్వడం ద్వారా కార్డుల వినియోగాన్ని పెంచుతాయి. రూపే క్రెడిట్ కార్డు యూపీఐ పేమెంట్లపై అందించే బెనిఫిట్స్ ఇకపై లావాదేవిపై అందించే రివార్డులు, ఇతర బెనిఫిట్స్‌తో, ఇతర ప్రయోజనాలతో పోలిస్తే ఏ మాత్రం తగ్గకుండా చూసుకోవాలి అని బ్యాంకులకు ఎన్‌పీసీఐ సూచించింది. ఇంటర్ ఛేంజ్ ఫీజు వర్తించే లావాదేవీలను దీన్నుంచి మినహాయింపులు కల్పించింది.