పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గబోతున్నాయా? అలా అయితే, ఎంత? పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుతాయని జోరుగా ప్రచారం సాగుతోంది.. తగ్గితే భారీగా తగ్గుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి, కేంద్రం నిజంగానే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తుందా..? ఇది పండుగల కాలమా? ప్రజలకు పండగ కానుక ఇచ్చేందుకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని కొందరు..ఈ టైంలో ఎందుకు తగ్గిస్తుందో? దీని వెనుక ఏదో ఒక కథలేకపోలేదు అని మరికొందరు.. ఇలా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.
అమెరికా క్రూడాయిల్ ధరలు ఇటీవల భారీగా పడిపోయాయి. గత బుధవారం క్రూడాయిల్ ధరలు 1 శాతానికి పైగా తగ్గాయి. బ్యారెల్ ధర 70 అమెరికన్ డాలర్ల దిగువకు పడిపోయింది. బ్రెంట్ క్రూడ్ ధరలు కూడా అదే బాటలో నడిచాయి. బ్యారెల్‌కు 1 డాలర్లు తగ్గి 72.75 డాలర్లకు చేరుకుంది. ముడిచమురు ధరలు తొమ్మిది కనిష్టాలకు చేరాయి. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ పతనంతో, ఇంధన ధరలను తగ్గించాలనే ప్రచారం ఊపందుకుంది. చమురు ధరలు జనవరి నుంచి కనిష్ట స్థాయికి చేరుకోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వ కీలక అధికారుల మధ్య చర్చలు సూచిస్తున్నాయి. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మార్చిలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రూ. 2 తగ్గించిన సంగతి తెలిసిందే. పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించడం ద్వారా అధిక ఇంధన ధరలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు ఉపశమనం కలిగించే యోచనలో కేంద్రం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.