రెండు ప్రైవేటు బ్యాంకులపై ఆర్‌బీఐ కొరడా ఝుళిపించింది. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఆదేశాలు పాటించడం లేదంటూ చర్యలు తీసుకుంది. చట్టపరమైన, నియంత్రణ పరమైన నిబంధనలను ఉల్లంఘించినందుకు భారీ జరిమానా విధించింది. రెండు బ్యాంకులకు కలిపి రూ.2.91 కోట్లు జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
డిపాజిట్లపై వడ్డీ, బ్యాంక్ రికవరీ ఏజంట్లు, బ్యాంకు కస్టమర్ సర్వీసులకు సంబంధించి నిబంధనలు పాటించకపోవడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు కోటి రూపాయల జరిమానా, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనలు పాటించకపోవడం, డిపాజిట్లపై వడ్డీ, కేవైసీ, వ్యవసాయ రుణాలకు సంబంధించి మార్గదర్శకాలు పాటించకపోవడంపై యాక్సిస్ బ్యాంక్ కు రూ.1.91 కోట్లు జరిమానా విధించినట్లు ఆర్బీఐ పేర్కొంది.