న్యూఢిల్లీ: వెనిజులా నుంచి చమురు దిగుమతులను పునఃప్రారంభించేందుకు రిలయన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆంక్షలు ఉన్నప్పటికీ వెనిజులా నుంచి చమురు కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రిఫైనర్ అయిన రిలయన్స్ త్వరలో వెనిజులా క్రూడ్ కొనుగోలును ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వెనిజులాపై అమెరికా మళ్లీ ఆంక్షలు విధించింది. నిష్పక్షపాత ఎన్నికల హామీని అధ్యక్షుడు మదురో నిలబెట్టుకోకపోవడమే ఇందుకు కారణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *