ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సెబీ షాక్ ఇచ్చింది. స్టాక్‌మార్కెట్‌లో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ‘అనిల్ అంబానీపై సెబీ రూ.25 కోట్ల జరిమానా కూడా విధించింది. రిలయన్స్ హోం ఫైనాన్స్ నిధులను దారి మళ్లించారని ఈ చర్యలకు దిగింది. అనిల్ అంబానీ సంస్థలతోపాటు మరో 24 సంస్థలపై కూడా నిషేధం విధించడం సంచనలంగా మారింది.
కంపెనీ నుండి నిధుల మళ్లింపు ఆరోపణలపై సెబి వారిపై పెద్ద చర్య తీసుకుంది. ఈ ఐదేళ్లపాటు సెక్యూరిటీ మార్కెట్లతో సంబంధం ఉండే ఎటువంటి కార్యక్రమాల్లో పొల్గొనకూడదని స్పష్టం చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ పై మాత్రం ఆరేళ్ల పాటు నిషేధం విధించడమే కాకుండా రూ.6 లక్షల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్డర్ అందిన 45 రోజుల్లోగా ఈ పెనాల్టీని చెల్లించాలని మార్కెట్ వాచ్‌డాగ్ తెల్పింది.