భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 899 పాయింట్లు లాభంతో 76,348 వద్ద ముగియగా, నిఫ్టీ 283 పాయింట్లు లాభంతో 23,190 వద్ద స్థిరపడింది. ఈరోజు 2,296 షేర్లు లాభాలతో కళకళలాడగా, 1,554 షేర్లు నష్టపోయాయి. 124 షేర్ల విలువలో ఎటువంటి మార్పు లేదు. అన్ని ప్రధాన రంగాల షేర్లు బలంగా ట్రేడయ్యాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ, టెలికాం షేర్లు 1 శాతం పెరిగాయి.
ఎయిర్‌టెల్, టైటాన్, బజాజ్ ఆటో, బీపీసీఎల్, బ్రిటానియా, ఐషర్ మోటార్స్ షేర్లు లాభాల్లో ముగియగా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్ షేర్లు నష్టపోయాయి.