దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్లు ఈరోజు మంచి పనితీరు కనబరుస్తుండటం గమనార్హం. భవిష్యత్ చర్చల్లో చైనా దిగుమతులపై సుంకాలను తగ్గిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెట్టుబడిదారుల సెంటిమెంట్ ను బలపరిచాయి. ముఖ్యంగా ఐటీ ఇండెక్స్ ఈరోజు చాలా లాభపడింది. బ్యాంక్ స్టాక్స్ పడిపోయాయి. సెన్సెక్స్ మరోసారి 80 వేల మార్కును దాటింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: హెచ్సీఎల్ టెక్నాలజీస్ (7.72), టెక్ మహీంద్రా (4.63), టాటా మోటార్స్ (4.59), ఇన్ఫోసిస్ (3.69), మహీంద్రా అండ్ మహీంద్రా (3.56).
టాప్ లూజర్స్: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.98), కోటక్ బ్యాంక్ (1.80), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.11), యాక్సిస్ బ్యాంక్ (0.87), ఐటీసీ (0.68).