దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. అమెరికా ఫెడ్ రేట్ల తగ్గింపు, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలతో సూచీలు జీవనకాల గరిష్ఠాలను అధిగమించాయి. సెన్సెక్స్ తొలిసారి 84 వేల మార్కును దాటగా నిఫ్టీ 25,800 మార్కు క్రాస్ చేసింది. అన్ని రంగాలు గ్రీన్‌లో కొనసాగాయి. దీంతో ఇన్వెస్టర్ల పంట పండింది. ఇక ముగింపులో సెన్సెక్స్ 1,359 పాయింట్లు లాభపడి 84, 544 దగ్గర ముగియగా నిఫ్టీ 375 పాయింట్లు లాభపడి 25, 790 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.68 దగ్గర హైలెవల్‌లో ముగిసింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: మహీంద్రా అండ్ మహీంద్రా (5.57%), ఐసీఐసీఐ బ్యాంక్ (3.77%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (3.66%), ఎల్ అండ్ టీ (3.07%), భారతి ఎయిర్ టెల్ (2.84%).
టాప్ లూజర్స్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.07%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.33%), టీసీఎస్ (-0.27%), బజాజ్ ఫైనాన్స్ (-0.07%).