దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, ఐటీ షేర్లలో కొనుగోళ్ల నేపథ్యంలో సూచీలు పుంజుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,331 పాయింట్లు పెరిగి 80,437 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 397 పాయింట్లు పుంజుకుని 24,541 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 1,400 పాయింట్లు లాభపడింది. ఈరోజు మదుపరుల సంపద రూ. 7 లక్షల కోట్ల మేర పెరిగింది.
బీఎస్ఈలో టెక్ మహీంద్రా (4.02%), టాటా మోటార్స్ (3.47%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.45%), టీసీఎస్ (2.91%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.65%) టాప్ గెయినర్స్ గా నిలిచాయి.