Sep-11 Gold Price: బంగారం ప్రేమికులకు కొంత ఉపశమనం లభించింది. కొద్దిరోజులుగా బంగారం ధరలు ఎగబాకడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందగా, తాజాగా ధరలు స్థిరంగా ఉన్నాయి. గురువారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో నిన్నటి రేట్లకే ట్రేడ్ అవుతున్నాయి. అయితే వెండి ధరలో మాత్రం స్వల్ప తగ్గుదల చోటుచేసుకుంది. కిలో వెండిపై రూ.100 తగ్గింది.
ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,509గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,300గా ఉంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.82,880గా ఉంది. వెండి ధర కిలోకు రూ.1,29,900గా ట్రేడ్ అవుతుండగా, చెన్నైలో మాత్రం కిలో వెండి రూ.1,40,000కి అమ్ముడవుతోంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో వెండి ధర కిలోకు రూ.1,29,900గానే కొనసాగుతోంది.
Internal Links:
సరికొత్త రికార్డులకు చేరిన గోల్డ్..
External Links:
గోల్డ్ లవర్స్‌కు రిలీఫ్.. ఈరోజు బంగారం ధరలు ఇలా..!